Amaravthi: రాజధానిని మార్చాలనుకుంటే తిరుపతికి మార్చండి: చింతా మోహన్‌ సూచన

  • దొనకొండ ఏ విధంగానూ అనుకూలం కాదు
  • దీనిపై కేంద్రంతో ఆయన చర్చలు కూడా జరిపారు
  • జగన్‌ సర్కారు వైఖరితో రైతుల్లో ఆందోళన

ఏపీ రాజధానిని అమరావతి నుంచి మార్చాలన్న నిర్ణయమే నిజమైతే ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిని రాజధానిగా చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ జగన్‌ సర్కారుకు సూచించారు. రాజధానిని మార్చే యోచనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారన్న ప్రచారం గత కొన్నాళ్లుగా జరుగుతుండగా, నిన్న మంత్రి బొత్స వ్యాఖ్యలతో ఇది ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో చింతా మోహన్‌ మాట్లాడుతూ రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు మార్చాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని, దీనిపై ఇప్పటికే కేంద్రంతో జగన్‌ చర్చలు కూడా జరిపారని అన్నారు.

అయితే రాజధాని విషయంలో జగన్‌ తొందరపడడం సరికాదని, రాజధానికి దొనకొండ ఏ విధంగానూ ఆమోద యోగ్యం కాదని అన్నారు. రాజధాని మార్చాలనే నిర్ణయానికి కట్టుబడితే అన్ని వసతులు ఉన్న తిరుపతిని రాజధానిగా చేయాలని కోరారు. ప్రస్తుతం జగన్‌ సర్కార్‌ వైఖరితో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, దీనిపై తక్షణం క్లారిటీ ఇవ్వాలని కోరారు.

More Telugu News