చిదంబరానికి మరో షాక్.. లుకౌట్ నోటీసులు జారీచేసిన ఈడీ!

- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దక్కని ముందస్తు బెయిల్
- అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ నేత చిదంబరం
- దేశం విడిచిపెట్టి వెళ్లకుండా లుకౌట్ నోటీసుల జారీ
ఈ నోటీసులు జారీచేస్తే సంబంధిత వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించి చిదంబరంపై అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసులు నమోదయ్యాయి.
2007లో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతించారనీ, ఇందుకు ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి.