RSS chief Mohan bhagavat: రిజర్వేషన్లను సమీక్షించాల్సిన అవసరం లేదు: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రాందాస్‌ కౌంటర్‌

  • ఇటీవల రిజర్వేషన్లపై సామరస్యపూర్వక చర్చ జరగాలన్న మోహన్‌ భగవత్‌
  • ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చిన అథవాలే
  • రిజర్వేషన్లు తగ్గించేది లేదని సాక్షాత్తు ప్రధాని చెప్పారని వ్యాఖ్య

ప్రస్తుతం దేశంలోని కొన్ని వర్గాల వారి కోసం అమలవుతున్న రిజర్వేషన్లను సమీక్షించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే స్పష్టం చేశారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేది లేదని సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ పలుమార్లు చెప్పినందున ఈ అంశంపై చర్చ అనవసరం అన్నారు.

రిజర్వేషన్లపై సామరస్యపూర్వక చర్చలు జరగాలని, రిజర్వేషన్లకు అనుకూలురు, వ్యతిరేకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చర్చ జరగాలని ఇటీవల రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అభిప్రాయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానం ఇప్పుడు బాగానే ఉందని, దీని గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదంటూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ వ్యాఖ్యలపై కౌంటర్‌లా రాందాస్‌ అథవాలే మాట్లాడడం సంచలనమయ్యింది.

More Telugu News