Hafiz saeed: నేను మంచోడిని.. ఉగ్రవాదానికి, నాకు సంబంధం లేదు: కోర్టును ఆశ్రయించిన హఫీజ్ సయీద్

  • గత జూలైలో హఫీజ్‌ను అరెస్ట్ చేసిన పాక్
  • 67 మందిపై 23 కేసులు నమోదు
  • వచ్చే నెల 2న విచారణకు రానున్న హఫీజ్ కేసు

తాను చాలా మంచోడినని, తనకూ ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదని అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ లాహోర్ హైకోర్టును ఆశ్రయించాడు. తనను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ హఫీజ్ మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఉగ్రవాద సంస్థలకు, తనకు ఎటువంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నాడు. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జమాత్‌-ఉద్‌-దవా, ఫలాహ్‌-ఐ-ఇన్సానియత్‌‌ల పేరిట ఉన్న ఆస్తులను మసీదుల అభివృద్ధికి ఉపయోగిస్తున్నట్టు తెలిపాడు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్నట్టు కలరింగ్ ఇచ్చే ప్రయత్నంలో గత జూలైలో హఫీజ్ సయీద్‌ను పాక్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అలాగే, అతడి సంస్థలకు చెందిన 67 మందిపై 23 కేసులు పెట్టింది. హఫీజ్ తన పిటిషన్‌లో వీటిని కూడా ప్రస్తావించాడు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని, అన్యాయంగా తనపై కేసులు పెట్టారని పేర్కొన్నాడు.  ప్రస్తుతం లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్న సయీద్ కేసును వచ్చే నెల 2న ఉగ్రవాద నిరోధక కోర్టు విచారించనుంది.  

More Telugu News