Allu Arjun: అలకనంద కోసం అయిదు కోట్ల ఖర్చుతో సెట్

  • షూటింగు దశలో 'అల వైకుంఠపురంలో'
  • అలకనంద పాత్రలో పూజా హెగ్డే 
  • అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో భారీ సెట్  

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ కథానాయకుడిగా 'అల వైకుంఠపురంలో' సినిమా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక పూజా హెగ్డే 'అలకనంద' పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువతి కావడంతో, ఆమె ఇంటి సెట్ ను ప్రత్యేకంగా వేస్తున్నారట.

హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో ఈ భారీ సెట్ నిర్మాణం జరుగుతోందని అంటున్నారు. ఇందుకోసం నిర్మాతలు 5 కోట్లు కేటాయించినట్టుగా సమాచారం. పూజా హెగ్డే .. టబు .. బొమన్ ఇరాని తదితరులపై ఈ ఇంటి సెట్లో సీన్స్ చిత్రీకరించనున్నారని చెబుతున్నారు. ఒక పాట చిత్రీకరణ కూడా ఈ ఇంటి సెట్లోనే ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

More Telugu News