Andhra Pradesh: ‘పోలవరం’ రద్దుపై నవయుగ పిటిషన్.. విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు!

  • ఈ నెల 14న పోలవరం కాంట్రాక్టు రద్దు
  • ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన నవయుగ
  • ప్రభుత్వం దురుద్దేశంతోనే కాంట్రాక్టు రద్దుచేసిందని ఆక్షేపణ

పోలవరం ప్రాజెక్టు పనుల కాంట్రాక్టును రద్దుచేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 14న ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ ఈ ప్రాజెక్టును చేపడుతున్న నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. పోలవరం  హెడ్‌వర్క్స్‌, జలవిద్యుత్ కేంద్రం పనులను కొనసాగించడంతో పాటు ఈ కాంట్రాక్టును మరెవరికీ కేటాయించకుండా ఉత్తర్వులు జారీచేయాలని కోరింది.

ఏపీ ప్రభుత్వ నిర్ణయం కారణంగా తమకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరుగుతుందనీ, తమ సంస్థ ప్రతిష్ఠకు అంతర్జాతీయంగా నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. పోలవరం అథారిటీ సూచనల్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తుచేసింది. ఏపీ ప్రభుత్వం దురుద్దేశంతోనే తమ కాంట్రాక్టును రద్దుచేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈరోజు వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది.

More Telugu News