Village Volunteers: జాగ్రత్తగా పని చేయండి.. తప్పు చేస్తే తొలగిస్తాం: బొత్స సత్యనారాయణ

  • గ్రామ వాలంటీర్లు ప్రజా సేవకులు
  • సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూసే బాధ్యత వారిదే
  • గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంది

కొత్తగా నియమితులైన గ్రామ వాలంటీర్లను ఉద్దేశిస్తూ ఏపీ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక సూచనలు చేశారు. గ్రామ వాలంటీర్లు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదని... ప్రజా సేవకులని ఆయన చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత వాలంటీర్లదేనని అన్నారు. గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా ఈ వ్యవస్థ రూపుదిద్దుకుందని చెప్పారు. ప్రతి గ్రామ వాలంటీర్ 50 కుటుంబాల చొప్పున బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని... బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జాగ్రత్తగా పని చేయాలని... తప్పులు చేసిన వారిని విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.

More Telugu News