కొత్త లుక్ లో బాలయ్య... సూపరంటున్న ఫ్యాన్స్!

20-08-2019 Tue 09:48
  • ఫ్రెంచ్ గడ్డంతో బాలయ్య
  • ఫోటో పోస్ట్ చేసిన నందమూరి సుహాసిని
  • కొత్త సినిమా లుక్ అంటున్న ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణ కొత్త లుక్ లో కనిపించారు. ఫ్రెంచ్ గడ్డంతో ఆయన ఉన్న ఫోటోను హరికృష్ణ కుమార్తె సుహాసిని తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకోగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. "బాలా బాబాయ్ కొత్త లుక్ ఆయన వయసుని ఒక 30 ఏళ్ళు తగ్గించింది. ఆయనకి ఆయనే సాటి..." అని ఆమె క్యాప్షన్ పెట్టారు. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల తరువాత, ఇప్పుడు బాలయ్య కొత్త చిత్రాన్ని చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బాలకృష్ణ ఇదే లుక్ లో కనిపిస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.