Rashmika: సినిమా పేరు ముందే చెప్పినందుకు రష్మికపై నిర్మాతల ఆగ్రహం!

  • తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న రష్మిక
  • తమిళంలో కార్తి జోడీగా చిత్రం
  • సినిమా పేరు 'సుల్తాన్' అని చెప్పిన రష్మిక

తమ అనుమతి లేకుండా సినిమా పేరును ముందుగానే సోషల్ మీడియాలో పెట్టిన నటి రష్మిక మందనపై నిర్మాతలు గుర్రుగా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల భామ, తమిళంలో సత్తా చాటాలన్న లక్ష్యంతో, ప్రస్తుతం కార్తికి జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను భారీ స్థాయిలో విడుదల చేయాలని దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్, నిర్మాతలు భావించారు. అందుకు ఓ ఈవెంట్ నిర్వహించాలని కూడా అనుకుంటున్న వేళ, రష్మిక తన సోషల్ మీడియాలో 'సుల్తాన్‌' సినిమా చిత్రీకరణలో నాలుగోరోజు... అంటూ ఓ ఫోటోను పోస్ట్‌ చేసింది. దీంతో ఆ సినిమా టైటిల్ చెప్పకుండానే చెప్పినట్టు అయిపోయింది. దీంతో తామనుకున్న టైటిల్ ను సస్పెన్స్‌ లేకుండా ఇలా రివీల్ చేయడం ఏంటని నిర్మాతలు ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.

More Telugu News