Narendra Modi: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్ చేసిన మోదీ

  • 30 నిమిషాల పాటు మాట్లాడుకున్న దేశాధినేతలు
  • తాజా పరిణామాలపై ట్రంప్ కు వివరించిన మోదీ
  • సరిహద్దు ఉగ్రవాదంపైనా చర్చ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ విషయాలను ట్రంప్ తో చర్చించారు. ఇరువురు దాదాపు 30 నిమిషాల పాటు ఫోన్ ద్వారా సంభాషించారు. ఇటీవలే ఆర్టికల్ 370 రద్దు చేయడం దరిమిలా ఏర్పడిన పరిణామాలను మోదీ అమెరికా అధ్యక్షుడికి వివరించారు.

పాకిస్థాన్ తో సంబంధాలు, జమ్మూకశ్మీర్ ప్రస్తుత పరిస్థితులు, సరిహద్దు ఉగ్రవాదం గురించి కూడా చర్చించినట్టు తెలిసింది. ముఖ్యంగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు శాంతికి విఘాతం కలిగించే స్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని మోదీ అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అంతేకాకుండా, అమెరికా వాణిజ్య ప్రతినిధులు మరోసారి సమావేశం కావాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు.

More Telugu News