Chittoor District: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. లగేజ్ కౌంటర్లు పెంచాలని ఈవో ఆదేశాలు

  • టీటీడీ అధికారులతో సమీక్షించిన ఈవో సింఘాల్  
  •  అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక ప్రాంతాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలి
  • పలు రాష్ట్రాల కళాబృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులతో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఈరోజు సమీక్షించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం లగేజ్ కౌంటర్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పలు రాష్ట్రాల కళాబృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సూచించారు. కళా బృందాల ప్రదర్శనపై ఆయా రాష్ట్రాల అధికారులతో చర్చించాలని సూచించారు.

భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్మించిన పైకప్పును పరిశీలించాలని, భక్తులు తిరిగే ప్రాంతాల్లో భవనాలపై పిడుగు నివారణ పరికరాలు అమర్చాలని, ఎస్వీ పురావస్తుశాలను అధిక సంఖ్యలో సందర్శించేలా తీర్చిదిద్దాలని సూచించారు. అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక ప్రాంతాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని, వర్షాలు, ఎండలకు ఇబ్బంది లేకుండా నిర్మించిన పైకప్పు మరమ్మతులకు, కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావాలని ఆదేశించారు.

More Telugu News