Whatsapp: వాట్సాప్ పేరు మార్పు... ఇక నుంచి 'వాట్సాప్ బై ఫేస్ బుక్'!

  • ప్రస్తుతం బీటా వెర్షన్ వినియోగదారులకు కనిపిస్తున్న 'వాట్సాప్ బై ఫేస్ బుక్'
  • 2014లో వాట్సాప్ ను కొనుగోలు చేసిన ఫేస్ బుక్
  • ఇన్ స్టాగ్రామ్ పేరు కూడా మార్చనున్న సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం

సోషల్ మీడియా రంగంలో త్వరితగతిన చాటింగ్ చేసేందుకు వీలు కల్పించే యాప్ గా వాట్సాప్ ఎంతో పేరుగాంచింది. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. తాజాగా వాట్సాప్ పేరు మారింది. ఇక నుంచి వాట్సాప్ బై ఫేస్ బుక్ గా దర్శనమివ్వనుంది. ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్ వినియోగదారులకు కొత్త పేరుతో కనిపిస్తోంది. త్వరలోనే ఇది అందరు వినియోగదారులకు దర్శనమివ్వనుంది.

వాట్సాప్ ను ఐదేళ్ల కిందట ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఈ యాప్ లో అనేక మార్పులు చేస్తూ వస్తోంది. తాజాగా తన పేరు జత చేసి వాట్సాప్ బై ఫేస్ బుక్ గా నామకరణం చేసింది. 2012లోనే ఇన్ స్టాగ్రామ్ ను కొనుగోలు చేసిన ఫేస్ బుక్ ఆ ఫొటో బేస్డ్ యాప్ కు కూడా తన పేరు జత చేస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News