Anil Kumar Yadav: భారీగా వరదలు వచ్చినప్పుడు కొన్ని ఇళ్లు, పొలాలు మునగడం సహజం: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

  • చంద్రబాబు నివాసాన్ని ముంచాలన్న ఆలోచన లేదన్న మంత్రి
  • ప్రాజక్టుల నుంచి నీటిని విడుదల చేసినప్పుడు అధికారులు కొన్ని లెక్కలు పాటిస్తారంటూ వ్యాఖ్యలు
  • సచివాలయంలో మీడియా సమావేశం

ఏపీ జలవనరులు, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాష్ట్రంలో వరద పరిస్థితులపై స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసాన్ని వరదల్లో ముంచాలని తాము కోరుకోలేదని, భారీగా వరదనీరు వచ్చినప్పుడు కొన్ని ఇళ్లు, పొలాలు మునగడం సహజమని వ్యాఖ్యానించారు. సరైన సమయంలోనే వరదనీటిని దిగువకు విడుదల చేశామని, ప్రాజక్టుల నుంచి నీటిని వదిలినప్పుడు అధికారులు కొన్ని లెక్కలు అనుసరిస్తారని వివరించారు. 2009 తర్వాత రాష్ట్రంలో ఈస్థాయిలో వరదలు రావడం ఇదే ప్రథమం అని అన్నారు. ఏపీ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News