Sensex: ఉత్సాహంగా కొనసాగి.. చివర్లో స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 52 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
  • 6 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

 దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూలతలతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజాల అండతో మార్కెట్లు ఈరోజు ఉత్సాహంగా కొనసాగాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే, చివర్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 52 పాయింట్ల లాభంతో 37,402 వద్ద ముగిసింది. నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి 11,053 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.66%), టెక్ మహీంద్రా (1.84%), యాక్సిస్ బ్యాంక్ (1.40%), ఎల్ అండ్ టీ (1.30%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.15%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-3.46%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.96%), ఓఎన్జీసీ (-1.48%), ఎస్బీఐ (-1.46%), టాటా స్టీల్ (-0.91%).

More Telugu News