Vinod: రోజూ అద్దం చూసుకుని ఏడుస్తున్నాను: 'జబర్దస్త్' వినోద్

  • 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన వినోద్ 
  • కొంతమంది నాపై దాడి చేశారు 
  • నా కన్ను బాగా దెబ్బతినేసింది

'జబర్దస్త్' కామెడీ షోలో లేడీ గెటప్స్ లో కనిపిస్తూ వినోద్ మంచి మార్కులు కొట్టేశాడు. నిజంగానే లేడీనేమో అనుకునేలా ఆయన నటిస్తూ ఆకట్టుకుంటుంటాడు. అలాంటి వినోద్ ఇటీవల ఓ ఇంటి కొనుగోలు విషయంలో ఏర్పడిన వివాదం కారణంగా జరిగిన దాడిలో గాయాల పాలయ్యాడు.

ఆ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " ఆ రోజున ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు నాపై దాడి చేసిన దగ్గర నుంచి ఓ కన్ను సరిగ్గా కనిపించడం లేదు. ఆ కన్ను చిన్నగా అయిపోయిందని కూడా అంతా అంటున్నారు. నేను లేడీ గెటప్పులో రాణించడానికి ప్రధానమైన కారణం నా కళ్లే. ఆ కళ్లలో ఒకటి చిన్నగా అయిపోవడం .. సరిగ్గా కనిపించకపోవడంతో నాకు చాలా భయం వేస్తోంది. రోజూ అద్దం చూసుకుని ఏడుస్తున్నాను" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

More Telugu News