Tirumala: శ్రీవారి మేల్ చాట్ వస్త్రాల ఈ-వేలం... రేపటి నుంచి మొదలు!

  • సర్వదర్శనానికి 11 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
  • ఆదివారం స్వామిని దర్శించుకున్న 95,722 మంది 
  • నిన్నటి హుండీ ఆదాయం రూ. 2.49 కోట్లు

తిరుమల-తిరుపతి అనుబంధ దేవాలయాల్లో భక్తులు స్వామికి కానుకలుగా సమర్పించిన మేల్ చాట్, ఉత్తరీయం వస్త్రాలకు ఈ-వేలం నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. భక్తులు పవిత్రంగా భావించే ఈ వస్త్రాలను ఆన్ లైన్ లో ఉంచి, వేలం వేయడం ద్వారా మరింత ఆదాయం పొందాలని టీటీడీ భావిస్తోంది. కాగా, ఈ ఉదయం తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక, టైమ్ స్లాట్ దర్శనాలకు 3 గంటల సమయం పడుతోంది. ఆదివారం నాడు స్వామివారిని 95,722 మంది భక్తులు దర్శించుకున్నారు. 40,481 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 2.49 కోట్ల ఆదాయం హుండీలో కానుకల ద్వారా లభించింది.

More Telugu News