ap7am logo

కేసీఆర్ మార్గదర్శకత్వంలో పని చేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయి: జెన్ కో-ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు

Sun, Aug 18, 2019, 05:49 PM
  • ప్రగతిభవన్ లో కేసీఆర్ ను కలిసిన ప్రభాకర్ రావు
  • విద్యుత్ రంగంపై కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉంది
  • ‘తెలంగాణ’లో విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత కేసీఆర్ దే
జెన్ కో ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ రాజీవ్ శర్మను తెలంగాణ సీఎం కేసీఆర్ సన్మానించారు. ప్రగతిభవన్ లో కేసీఆర్ ను వారు కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ, విద్యుత్ రంగంపై కేసీఆర్ కు పూర్తి అవగాహన ఉందని కొనియాడారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో పనిచేయడం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభ పరిష్కారం ఘనత కేసీఆర్ దే అని ప్రశంసించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad