Saaho: ‘సాహో’ ప్రీ-రిలీజ్ వేడుక.. ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు!

  • నేటి సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ-రిలీజ్ వేడుక
  • ‘సాహో’లోని ఓ స్టిల్ తో 60 అడుగుల ప్రభాస్ కటౌట్
  •  ప్రీ-రిలీజ్ వేడుకకు భారీ  ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 30న ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక నేటి సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. ‘సాహో’ లోని ఓ స్టిల్ తో ప్రభాస్ భారీ కటౌట్ ను రూపొందించారు. అరవై అడుగుల ఎత్తు ఉన్న ఈ కటౌట్ ఆకట్టుకుంటోంది. ప్రీ-రిలీజ్ వేడుక నిమిత్తం భారీ  ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కాగా, భారీ ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ‘సాహో’ చిత్రంలో వినియోగించిన కార్లు, బైక్స్, ఇతర వాహనాలను వీక్షించే అవకాశం కల్పించారు.

More Telugu News