Telangana: తెలంగాణలో ‘ఆరోగ్యశ్రీ’ వైద్య సేవల నిలిపివేతతో రోగులకు ఇబ్బందులు!

  • మూడు రోజుల నుంచి నిలిచిపోయిన ‘ఆరోగ్య శ్రీ’ సేవలు
  • పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్న ఆస్పత్రులు
  • నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య

తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో మూడు రోజులుగా ‘ఆరోగ్య శ్రీ’ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. కాగా, తెలంగాణలోని 242 ఆసుపత్రుల్లో ‘ఆరోగ్యశ్రీ’ సేవలు నిలిచిపోయాయి.

ఈ పథకానికి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం చెల్లించలేదు. బిల్లుల చెల్లింపు కోసం ఎదురుచూసినా ప్రయోజనం లేకపోవడంతో ‘ఆరోగ్యశ్రీ’ వైద్య సేవలను నిలిపివేయాలని ప్రైవేటు ఆసుపత్రులు నిర్ణయించుకున్నాయి.

More Telugu News