Rameshwar: 100 మీటర్ల పరుగు 11 సెకన్లలో పూర్తి చేసిన 'ఇండియన్ చిరుత'... ఫిదా ఆయిన కేంద్ర మంత్రి!

  • మధ్యప్రదేశ్ కు చెందిన రామేశ్వర్
  • వైరల్ అయిన పరుగు వీడియో
  • మెరుగైన శిక్షణ ఇప్పిస్తానన్న కిరణ్ రిజిజు

100 మీటర్ల పరుగుపందెం పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చే పేరు 'జమైకన్ చిరుత'గా పేరున్న ఉసేన్‌ బోల్ట్‌. అతని పరుగులో వేగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో రికార్డులు అతని సొంతం. కానీ, మధ్యప్రదేశ్‌ కు చెందిన రామేశ్వర్‌ (19) పరుగు వీడియోను చూస్తే మాత్రం మీరు కూడా మనకూ ఓ ఉసేన్ బోల్డ్ దొరికాడని ఒప్పుకోక తప్పదు. ఈ వీడియోను తిలకించిన మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, దాన్ని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజుకు చేర్చడంతో, రామేశ్వర్ లోని ప్రతిభకు రిజిజు ఫిదా అయ్యాడు. కనీసం చెప్పులు కూడా లేకుండా, తారు రోడ్డుపై 100 మీటర్ల పరుగును 11 సెకన్లలో పూర్తి చేశాడు రామేశ్వర్.

ఈ వీడియోను చూపిస్తూ, ఇండియాలో నైపుణ్యానికి కొదవలేదని, సరైన వేదిక దొరికితే సత్తా నిరూపించుకునే వారు ఎందరో ఉన్నారని చెబుతూ, ఈ యువకుడు మంచి ప్రతిభ కనబరుస్తున్నాడని, మంచి సౌకర్యాలు కల్పిస్తే, దేశానికి పేరు తెస్తాడంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ, కిరణ్ రిజిజుకి ట్యాగ్‌ చేశారు. ఈ వీడియోను చూసిన రిజిజు, అతన్ని తన వద్దకు పంపాలని, అథ్లెటిక్స్‌ అకాడమీలో చేర్పించి మరింత మెరుగయ్యేలా శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

More Telugu News