Krishna River: క్రమంగా శాంతిస్తున్న కృష్ణమ్మ... ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గిన వరద!

  • వారం రోజులుగా ఉగ్రరూపం
  • మూడు రోజుల క్రితం 9 లక్షల క్యూసెక్కుల వరద
  • ప్రస్తుతం ఆరున్నర లక్షల క్యూసెక్కులలోపే

గడచిన వారం రోజులుగా ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన కృష్ణానది, క్రమంగా శాంతిస్తోంది. మూడు రోజుల క్రితం దాదాపు 9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్న బ్యారేజ్ వద్ద, ఈ ఉదయం 6.26 లక్షల క్యూసెక్కుల వరద నమోదైంది. బ్యారేజ్ లో నీటి నిల్వ సామర్థ్యంతో పోలిస్తే, అధికంగా నీరు వస్తుండటంతో, 70 గేట్లనూ ఎత్తి, ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతోనే, ఆ ప్రభావం కృష్ణానదిపై కనిపిస్తోందని, అందుకే వరద తగ్గుముఖం పట్టిందని నీటి పారుదల శాఖ అధికారులు ప్రకటించారు.

ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ లో 12 అడుగుల మేరకు నీరు ఉందని, ఇది 3.07 టీఎంసీలకు సమానమని తెలిపారు. డెల్టాలకు 17 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. ముంపు ప్రాంతాల్లో సైతం వరద తగ్గిందని, ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్, ఎప్పటికప్పుడు వరద ప్రభావాన్ని సమీక్షించారని వెల్లడించారు.

More Telugu News