Tirumala: ఎంత చిల్లర తీసుకుంటే అంత నగదు డిపాజిట్: బ్యాంకులకు తేల్చి చెప్పిన టీటీడీ

  • నానాటికీ పెరిగిపోతున్న చిల్లర నాణాలు
  • నగదు డిపాజిట్లపై ఆంక్షలు విధించిన టీటీడీ
  • చిల్లర తీసుకొనేందుకు ముందుకొచ్చిన రెండు బ్యాంకులు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు కానుకలుగా సమర్పించే చిల్లర నాణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, వాటిని స్వీకరించేందుకు బ్యాంకులు నిరాసక్తంగా ఉండటం, చిల్లరను స్టోర్ చేసేందుకు సరైన గోడౌన్లు లేకపోవడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ బ్యాంకు అయితే, తమ వద్ద నుంచి చిల్లరను తీసుకుంటాయో, ఆ బ్యాంకుల్లోనే భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారం, కరెన్సీ నోట్లను డిపాజిట్ చేస్తామని తేల్చి చెప్పింది.

ఈ విషయాన్ని స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి తెలిపారు. హుండీల నుంచి చిల్లరను పరకామణిలో వేరుచేసి లెక్కించే బాధ్యతలను కూడా ఆ బ్యాంకులే తీసుకోవాలని ఆయన అన్నారు. కాగా, టీటీడీ ఇచ్చిన ఆఫర్ కు ఇప్పటికే తిరుమలలో వివిధ రకాల సేవల్లో నిమగ్నమైన విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో దాదాపు మూడు సంవత్సరాల నుంచి టీటీడీ అధికారులను వేధిస్తున్న చిల్లర సమస్యకు ఓ పరిష్కారం లభించినట్లయింది.

More Telugu News