Revanth Reddy: నల్లమలలో యురేనియం తవ్వకాలపై రేవంత్ రెడ్డి ఆగ్రహం

  • నల్లమలలో యురేనియం తవ్వకాలకు వస్తే గుండెల్లో గునపం దింపుతానంటూ వార్నింగ్
  • తవ్వకాలకు సహకరిస్తున్న నేతలపై సామాజిక బహిష్కరణ విధించాలంటూ పిలుపు
  • యురేనియం తవ్వకాలు జరగడంలేదని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాలని రేవంత్ డిమాండ్

మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నల్లమలలో యురేనియం తవ్వకాలపై తీవ్రస్థాయిలో స్పందించారు. నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం వెంటనే అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తవ్వకాలకు సహకరిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలపై సామాజిక బహిష్కరణ విధించాలని సూచించారు. యురేనియం తవ్వకాలు జరగడంలేదంటూ సీఎం కేసీఆర్ హామీ ఇవ్వాలని, హామీ ఇచ్చేంతవరకు పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు.

నల్లమల అడవి బిడ్డలకు తాను అండగా నిలుస్తానని, నల్లమలలో ఎవరైనా యురేనియం తవ్వడానికి వస్తే వారి గుండెల్లో గునపం దింపుతానని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News