Ukraine: ఉక్రెయిన్ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది సజీవ దహనం!

  • ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగరంలో ఘటన
  • టోక్యో స్టార్ హోటల్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
  • మూడు గంటలు కష్టపడి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

యూరప్ దేశమైన ఉక్రెయిన్ లో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ లోని ఒడెస్సా నగరంలో ఉన్న ‘టోక్యో స్టార్ హోటల్’లో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో హోటల్ అంతా వ్యాపించాయి. దీంతో 8 మంది సజీవదహనం కాగా, 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ, అత్యవసర సేవల బృందం ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు కష్టపడి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. టోక్యో స్టార్ ఓ మధ్య తరగతి హోటల్. ఇందులో 273 గదులు ఉన్నాయి. అయితే ప్రమాద సమయంలో ఈ హోటల్ లో ఎంతమంది ఉన్నారు? అగ్ని ప్రమాదం ఎందుకు సంభవించింది? అన్న విషయాలపై ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు.

More Telugu News