Rajinikanth: విలన్ కావాలనుకున్న నన్ను ఆయనే హీరో చేశారు: రజనీకాంత్

  • నన్ను హీరోను చేసిన ఘనత కలైఙ్ఞానందే
  • ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నారని తెలిసింది
  • ఆయనకు ఒక మంచి ఇంటిని నేనే ఏర్పాటు చేస్తా

సినీ నిర్మాత, కథారచయిత కలైఙ్ఞానంకు ప్రముఖ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో సన్మానం జరిగింది. ఈ సభకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ, విలన్ కావాలనే ఉద్దేశంతోనే సినిమా రంగంలోకి ప్రవేశించానని... తొలుత విలన్ గానే నటించానని చెప్పారు. అయితే, తనను హీరోను చేసిన ఘనత మాత్రం కలైఙ్ఞానంకే దక్కుతుందని తెలిపారు.

ప్రస్తుతం కథారచయితలకు తగిన గుర్తింపు లభించడం లేదని... ఈ పరిస్థితి మారాలని చెప్పారు. కలైఙ్ఞానం అద్దె ఇంట్లో నివసిస్తున్నారనే విషయం తనకు తెలిసిందని... ఆయనకు ఇంటిని ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని... అయితే, ప్రభుత్వానికి తాను ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదని, ఆయన ఉండటానికి ఒక మంచి ఇంటిని తానే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

More Telugu News