old elephent: వయసుడిగిన గజరాజుకు అలంకరణ చేసి తిప్పడంతో.. తీవ్ర అస్వస్థత!

  • 70 ఏళ్ల వయసులో ఊరేగింపునకు
  • శ్రీలంక క్యాండీలో యజమాని కర్కశత్వం
  • ప్రస్తుతం లేవలేని స్థితిలో ఉన్న ఏనుగు

దాని వయసు డెబ్బయి ఏళ్లు. బక్కచిక్కి అసలు గజరాజు అన్న అర్థానికే వ్యతిరేకం అన్నట్లుంది దాని రూపం. అడుగుతీసి అడుగు వేయాలంటే అష్టకష్టాలు పడే స్థితిలో ఉన్న గజరాజును ఏకంగా ఓ ఊరేగింపు కోసం దాని అసలు రూపాన్ని దాచేస్తూ ముస్తాబు చేసి గంటపాటు తిప్పడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఊరేగింపు నుంచి రాగానే కుప్పకూలిపోయి ప్రస్తుతం లేవలేని స్థితిలో ఉంది.

వివరాల్లోకి వెళితే...శ్రీలంకలో ఏటా జరిగే బౌద్ధుల ఊరేగింపు ప్రసిద్ధి చెందినది. క్యాండీకి చెందిన ఓ యజమాని వద్ద 70 ఏళ్ల ‘తికిరి’ అనే ఏనుగు ఉంది. సాధారణంగా ఏనుగు జీవిత కాలం  48 ఏళ్లు. అంటే అదనంగా ఇది మరో 22 ఏళ్లు జీవించింది. కానీ పూర్తిగా బక్కచిక్కిపోయి నడవలేని స్థితిలో ఉంది.

ఈ పరిస్థితుల్లో నిన్న క్యాండీలో జరిగిన బౌద్ధుల ఊరేగింపులో దీని శరీరంపై అందమైన వస్త్రాలు కప్పి ముస్తాబుచేసి తిప్పారు. చాలాసేపు నిలబడి ఉండడం, ఎక్కువ దూరం నడవాల్సి రావడంతో ఉత్సవాల నుంచి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ గజరాజు కుప్పకూలింది. ప్రస్తుతం ఇది లేవలేని స్థితిలో ఉంది. ఈ విషయం బయటపడడంతో జంతు ప్రేమికుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

More Telugu News