Triple talak: ట్రిపుల్ తలాఖ్ చట్టం అమలులోకి వచ్చాక అరెస్ట్ అయిన తొలి వ్యక్తి!

  • పెళ్లయ్యాక గల్ఫ్ వెళ్లిన దంపతులు 
  • అక్కడ భార్యను చిత్ర హింసలు పెట్టి ముమ్మారు తలాఖ్ చెప్పిన భర్త
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

ట్రిపుల్ తలాఖ్ చట్టం వచ్చాక అరెస్ట్ అయిన తొలి వ్యక్తిగా కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఈకే ఇస్సామ్ రికార్డులకెక్కాడు. తన భర్త తనకు ముమ్మారు తలాఖ్ చెప్పి వదిలించుకోవాలని చూశాడంటూ ఇస్సామ్ భార్య పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ట్రిపుల్ తలాఖ్ చట్టం కింద ఇస్సామ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రస్తుతం బెయిలుపై ఉన్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలిని పెళ్లాడాక ఇస్సామ్ ఆమెను గల్ఫ్ తీసుకెళ్లాడు. అక్కడామెకు నరకం చూపించాడు. రోజూ చిత్రహింసలు పెట్టి వేధించేవాడు. ఈ నెల ఒకటో తేదీన తిరిగి స్వదేశానికి చేరుకున్న ఇస్సామ్ భార్యకు ముమ్మారు తలాఖ్ చెప్పి విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత మరో అమ్మాయిని ఇస్సామ్ వివాహం చేసుకున్నట్టు బాధితురాలి తరపు న్యాయవాది అన్వర్ తెలిపారు. ఆమెకు సంబంధించిన డబ్బు, బంగారం నిందితుడి వద్దే ఉన్నాయని పేర్కొన్నారు.  

More Telugu News