cm: జగన్ ఇంట్లో ఉండే కిరణ్ కుట్రకి నీటి పారుదల శాఖ అని కలరింగ్ ఇవ్వడమేంటి?: నారా లోకేశ్ ఫైర్

  • ఎన్ఎస్జీ భద్రత కలిగిన మాజీ సీఎం నివాసాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించారు!
  • ఆ వివరాలను వైసీపీ పార్టీ పేజీలో పెడతారా?
  • ఈ కుట్రలో కిరణ్ ఎవరు?

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ చక్కర్లు కొట్టిన ఘటనపై ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, నారా లోకేశ్ స్పందిస్తూ, ఎన్ఎస్జీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించడమే కాకుండా, ఆ వివరాలను వైసీపీ పార్టీ పేజీలో, అందరికీ అందుబాటులో ఎలా ఉంచుతారు? ఏమిటీ కుట్ర? అని ప్రశ్నించారు. ఈ కుట్రలో కిరణ్ ఎవరు? జగన్ నివాసంలో ఉండే కిరణ్ అమలు చేస్తున్న కుట్రకి నీటి పారుదల శాఖ అని కలరింగ్ ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.

More Telugu News