CRPF: ప్రజలను కాపాడేందుకు... వరదలో జవాన్ల మానవహారం!

  • చత్తీస్ గఢ్ సుక్నా జిల్లాలో ఘటన
  • పోటెత్తిన మాల్గర్ నది
  • ప్రజలను కాపాడిన జవాన్లు

చత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో మాల్గర్ నది వరద ప్రవాహంతో పోటెత్తగా, ప్రజలను కాపాడేందుకు సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్) సెకండ్ బెటాలియన్ జవాన్లు మానవహారంగా నిలబడి, ప్రజలను వరద నీటి నుంచి దాటించారు. గదిరాస్ ప్రాంతంలో దాదాపు గంటపాటు వరద నీరు ప్రవహిస్తున్న వంతెనపై నిలబడిన జవాన్లు, ప్రజలు నదిని దాటేంతవరకూ ఆసరాగా ఉన్నారు.

ఈ ఘటన నిన్న రక్షాబంధన్ నాడు జరగడంతో పలువురు మహిళలు, యువతులు జవాన్లకు కృతజ్ఞతలు చెబుతూ, వారికి రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ నాడు, తమ సోదరీమణులు నదికి అవతలి వైపున చిక్కుకున్నారని తెలిసి, తాము మానవహారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని జవాన్లు తెలిపారు.

More Telugu News