భేషజం చూపని వైఎస్ జగన్... పతకం కిందపడితే స్వయంగా తీసిన వైనం!

16-08-2019 Fri 08:34
  • విజయవాడ మునిసిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు
  • కిందపడిన అధికారి పతకం
  • స్వయంగా తీసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చుట్టూ సైగ చేస్తే, ఆదేశాలు అమలు చేసే అధికారులు ఉన్న వేళ, ఏ మాత్రం భేషజం చూపకుండా, కిందపడ్డ పతకాన్ని స్వయంగా చేత్తో తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఘటన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడ, మునిసిపల్ మైదానంలో వేడుకలు జరుగుతున్న వేళ జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, పోలీసులకు అవార్డులను అందిస్తున్న వేళ, ఓ పోలీసు అధికారికి పతకాన్ని జగన్ అలంకరించారు. అయితే, సదరు అధికారి సీఎంకు సెల్యూట్ చేసే సమయంలో ఆ పతకం జారిపోయింది. దాన్ని గమనించని సదరు అధికారి, ముందుకు వెళ్లిపోగా, దాన్ని గమనించిన జగన్, ఆ పతకాన్ని స్వయంగా తీసి, పక్కనే ఉన్న మరో అధికారికి అందించారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.