Indian: 'ఇండియన్-2'లో సేనాపతి ఇలా!

  • శంకర్ దర్శకత్వంలో చిత్రం
  • సినిమా ఆగిపోయిందని రూమర్స్
  • వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టిన శంకర్
  • తాజాగా పోస్టర్ విడుదల

కమలహాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిన 'భారతీయుడు' చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు శంకర్ 'భారతీయుడు-2'ను ప్రారంభించారు. ఈ సినిమా ఆగిపోయిందని ఇటీవల కొన్ని రూమర్లు కూడా వచ్చాయి. తాజాగా, శంకర్ వాటికి ఫుల్ స్టాప్ పెట్టారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కమలహాసన్ లుక్ తో 'ఇండియన్-2' పోస్టర్ ను ఆయన విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తొలి చిత్రంతో పోలిస్తే, 'సేనాపతి' పాత్రలో కమల్ పొడుగ్గా కనిపిస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి. 

More Telugu News