Kajal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఆ వార్తలను ఖండించిన కాజల్ 
  • దీపావళికి అల్లరి నరేశ్ 'బంగారుబుల్లోడు'
  • ప్రభాస్ 'సాహో' నిడివి తగ్గింపు  

*  కమలహాసన్, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'భారతీయుడు 2' ప్రాజక్టు నుంచి తాను తప్పుకున్నట్టు వస్తున్న వార్తలను కథానాయిక కాజల్ ఖండించింది. 'ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఈ చిత్రంలో నటించడాన్ని గౌరవంగా, గొప్పగా భావిస్తున్నాను. అలాంటప్పుడు ఎందుకు తప్పుకుంటాను?' అంటూ వివరణ ఇచ్చింది.  
*  అల్లరి నరేశ్ హీరోగా పీవీ గిరి దర్శకత్వంలో రూపొందుతున్న 'బంగారు బుల్లోడు' చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వచ్చే దీపావళికి చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్రం రన్ టైంను లాక్ చేశారు. వాస్తవానికి చిత్రం నిడివి మూడు గంటల వరకు వచ్చినప్పటికీ, కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసి, 2 గంటల 48 నిమిషాలకు తగ్గించారట.

More Telugu News