Narendra Modi: ట్రిపుల్ తలాఖ్ రద్దుపై మోదీ 'రాఖీ చెల్లెలు' స్పందన!

  • హర్షం వ్యక్తం చేసిన ఖమర్ మొహిసిన్ షేక్
  • ఖురాన్, ఇస్లాంలో ఎక్కడా ట్రిపుల్ తలాఖ్ ప్రస్తావన లేదన్న ఖమర్
  • మోదీకి తన భర్త వేసిన పెయింటింగ్ ను కానుకగా ఇచ్చిన వైనం

గత 20 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కడుతున్న ఖమర్ మొహిసిన్ షేక్ ట్రిపుల్ తలాఖ్ రద్దుపై స్పందించారు. తన అన్నయ్య మోదీ మాత్రమే ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోగలరని వ్యాఖ్యానించారు. ఖురాన్ లో కానీ, ఇస్లాంలో కానీ ట్రిపుల్ తలాఖ్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ రాఖీ పండుగ సందర్భంగా ఖమర్ ప్రధాని నివాసానికి వచ్చారు. రాఖీ కట్టిన అనంతరం తన భర్త వేసిన వర్ణచిత్రాన్ని మోదీకి కానుకగా ఇచ్చారు. ప్రతి సంవత్సరం మోదీ అన్నయ్యకు రాఖీ కట్టడం తనకు దక్కిన మహద్భాగ్యంగా భావిస్తానని తెలిపారు.

వాస్తవానికి ఖమర్ పాకిస్థాన్ జాతీయురాలు. అయితే వివాహం తర్వాత ఆమె భారత్ వచ్చేశారు. అప్పట్లో మోదీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఏడాది ఆయనకు రాఖీ కట్టడాన్ని ఖమర్ ఓ ఆనవాయితీగా పాటిస్తున్నారు.

More Telugu News