Jagan: ఈ రాత్రికి కుటుంబంతో కలిసి సీఎం జగన్ అమెరికా పయనం

  • చిన్న కుమార్తె అడ్మిషన్ కోసం అమెరికా వెళుతున్న జగన్
  • అమెరికాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్న ఏపీ సీఎం
  • ఈ నెల 24న రాష్ట్రానికి తిరిగి రాక

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. తన చిన్న కుమార్తె వర్షా రెడ్డిని ఉన్నత విద్య కోసం అమెరికాలోని ఓ విద్యాసంస్థలో చేర్చుతున్నారు. అడ్మిషన్ ప్రక్రియ కోసం జగన్ తన కుటుంబంతో కలిసి ఈ రాత్రికి అమెరికా వెళుతున్నారు. రాత్రి 9.30 గంటలకు ఆయన బయల్దేరనున్నారు. ఎల్లుండి డల్లాస్ లో జరిగే ఎన్నారైల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. ఆపై అనేక కార్యక్రమాలతో బిజీగా గడపనున్న జగన్ ఈ నెల 24న రాష్ట్రానికి తిరిగి వస్తారు.

More Telugu News