asom: నీడలా వెంటాడిన ఫేస్‌బుక్‌ పోస్టింగ్‌... రెండేళ్ల తర్వాత కేసు నమోదు!

  • బీఫ్‌ తింటున్న ఫొటో అప్‌లోడ్‌ చేసిన రీసెర్చి స్కాలర్‌
  • ఇప్పుడు పత్రికల్లో రావడంతో పోలీసులు ఆరా
  • నన్ను ఇబ్బంది పెట్టేందుకే కేసు అంటున్న బాధితురాలు

సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టింగ్‌ విషయంలో సదా అప్రత్తంగా ఉండాలని, తప్పుచేస్తే ఆ పొరపాటు మనల్ని నీడలా వెన్నంటి ఎప్పటికైనా కొంప ముంచుతుందనేందుకు ఉదాహరణ ఈ ఘటన. అసోం రాజధాని గువహటిలోని గౌహతి యూనివర్సిటీకి చెందిన ఓ రీసెర్చి స్కాలర్‌ రెహానా సుల్తానా 2017 జూన్‌లో ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్‌ చేసిన ఫొటోపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేయడం విశేషం.

బీఫ్‌ తింటున్న ఈ ఫొటోను ఆమె అప్పట్లో అప్‌లోడ్‌ చేసింది. ఆ ఫొటో ఇటీవల స్థానిక పత్రికల్లో రావడంతో పోలీసులు సుమోటోగా తీసుకుని ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ‘ఆ ఫొటో నేను పెట్టిందే. అప్పట్లో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌లో టీమిండియా పేలవంగా ఆడింది. ఆగ్రహాన్ని ఆపుకోలేక ఆ ఫొటో పోస్టు చేశాను. ఆ తర్వాత దాన్ని డిలీట్‌ చేశాను. మరి ఇప్పుడు స్థానిక పత్రికల్లో ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు’ అంటూ బాధితురాలు వాపోతోంది.

తాను నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతున్నందున కుట్రపూరితంగా ఎవరో ఈ పనిచేసినట్లు అనుమానిస్తున్నట్లు బాధితురాలు వాపోయింది. కాగా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను అవమానించేలా పోస్టు పెట్టిన ఓ యువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News