loan waiving: అన్నదాతకు కేసీఆర్‌ తీపికబురు: రూ.లక్ష రుణమాఫీకి నేడు ఉత్తర్వులు

  • స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటన
  • గోల్కొండ కోట నుంచి రైతుకు భరోసా
  • మా రైతు విధానాలు యావత్‌ దేశానికి ఆదర్శమని ప్రకటన

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్నదాతకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీపి కబురు అందించారు. లక్ష రూపాయలలోపు రైతుల రుణమాఫీకి ఈరోజు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. గొల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌ అనంతరం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 తమ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. మన రైతుబంధు, రైతు బీమా పథకాలను వ్యవసాయాభివృద్ధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అమలయ్యే గొప్ప కార్యక్రమాల జాబితాలో ఐక్యరాజ్యసమితి చేర్చడంతో మన రాష్ట్ర కీర్తి అంతర్జాతీయ స్థాయికి పెరిగిందన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి రూ.10 వేలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.

More Telugu News