Jagan: తొలిసారి సీఎంగా... త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్!

  • ఏపీ వ్యాప్తంగా సంబరాలు
  • విజయవాడలో జెండా ఎగురవేసిన జగన్
  • ఆకర్షించిన శకటాల విన్యాసాలు

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలిసారిగా సీఎం హోదాలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆపై రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు జగన్. ఏపీ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 13 శాఖల శకటాల విన్యాసాలు ప్రజలను అలరించాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

More Telugu News