Karnataka: రూ. 10 కోట్లిస్తే... ఓ ఊరికి మీ పేరు: యడియూరప్ప నయా స్కీమ్

  • వరదలతో కర్ణాటక అతలాకుతలం
  • 60 కంపెనీల ప్రతినిధులతో యడియూరప్ప సమావేశం
  • పునర్వైభవానికి సహకరించాలని వినతి

ఇటీవలి కాలంలో వర్షాలు, వరదలతో కర్ణాటక రాష్ట్రం, ముఖ్యంగా తీర ప్రాంతాలు అతలాకుతలం కాగా, పల్లెలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప కొత్త స్కీమ్ ను ప్రకటించారు. ఏదైనా పల్లెకు రూ.10కోట్లు విరాళం ఇస్తే, సదరు వ్యక్తులు, లేదా సంస్థల పేర్లను వారు ఎంపిక చేసుకునే పల్లెలకు పెట్టనున్నామని అన్నారు. తాజాగా ఆయన విధానసౌధలో 60కి పైగా కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఈ ఆఫర్ ను ఇచ్చారు.

ఈ వరదలు 23 జిల్లాలపై ప్రభావం చూపించాయని, ఆదుకునేందుకు ఉదారవాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, కేరళ వైపు నుంచి రాష్ట్రంపైకి వరదలు వచ్చాయని, పలు చోట్ల కొండ చరియలు విరిగిపడి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయని అన్నారు. 56 వేల ఇళ్లు కూలిపోయాయని, ఎన్నో వంతెనలు, వందల కిలోమీటర్ల రహదారులు ధ్వంసం అయ్యాయని తెలిపారు. 6.97 లక్షల మంది ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారని, పల్లెలకు పూర్వవైభవం త్వరగా రావాలంటే పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. రూ.10 కోట్లు విరాళం ఇచ్చే వారి పేర్లకు శాశ్వత గుర్తింపును తెస్తామని అన్నారు.

More Telugu News