East Godavari District: ఎమ్మెల్యే రాపాక అరెస్టును ఖండించిన చంద్రబాబు

  • ఎవరిపై దౌర్జన్యం చేశారని రాపాకను అరెస్టు చేశారు?
  • వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు?
  • రాష్ట్రంలో వైసీపీ వాళ్లకో న్యాయం? ఇతరులకో న్యాయమా?

తూర్పుగోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడి కేసులో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేయడం, ఆపై స్టేషన్ బెయిల్ పై ఆయన విడుదల కావడం తెలిసిందే. ఈ ఘటనపై మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. రాపాక అరెస్టును ఖండించారు. ఎవరిపై దౌర్జన్యం చేశారని రాపాకను అరెస్టు చేశారు? మరి, ‘జమీన్ రైతు’ అధినేత డోలేంద్ర ప్రసాద్ పై దాడికి పాల్పడ్డ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ వాళ్లకో న్యాయం? ఇతరులకో న్యాయమా? రాష్ట్రంలో చట్టం వైసీపీ నేతలకు చుట్టంగా మారిందా? టీడీపీకి ఓటేసిన వారిపై కేసులు బనాయించి అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు.

More Telugu News