Japan: అమ్మకానికి జపాన్ ప్రధాని విమానం.. బెడ్రూమ్, ఆఫీస్ సహా సకల సౌకర్యాలు!

  • సీఎస్డీఎస్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ ప్రకటన
  • 14 మంది ప్రధానులు ప్రయాణించిన విమానం
  • ఒకేసారి 80 మంది ప్రయాణించే ఛాన్స్

సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, ధనికులు సరికొత్త విమానాలను కొనేందుకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ కొంతమంది మాత్రం అధ్యక్షుడు, మిలటరీ విమానాలపై మోజు పెంచుకుంటారు. అలాంటి వాటిని కొనేందుకు ఇష్టపడతారు. అలాంటి వారి కోసమే సీఎస్డీఎస్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ కీలక ప్రకటన చేసింది. జపాన్ ప్రధానులు విదేశాలకు రాకపోకలు సాగించేందుకు ఉద్దేశించిన ఎయిర్ ఫోర్స్ వన్ బోయింగ్ 747-400 విమానం అమ్మకానికి వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఈ విమానంలో ఇప్పటివరకూ 14 మంది జపాన్ ప్రధానమంత్రులు ప్రయాణించారని వెల్లడించింది. 1991లో తయారైన ఈ బోయింగ్ విమానం ఇప్పటివరకూ కేవలం 16,332 గంటలు మాత్రమే గాల్లో విహరించిందని పేర్కొంది. ఇందులో 80 మంది ప్రయాణికులు ఒకేసారి ఎక్కడికైనా వెళ్లవచ్చని చెప్పింది. ఈ విమానంలో బెడ్రూమ్, స్నానాల గది, కార్యాలయం, లాంజ్ ఏరియా వంటి సౌకర్యాలు ఉన్నాయని సీఎస్డీఎస్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ తెలిపింది. అన్నట్లు ఈ విమానం ధర ఎంత అనుకుంటున్నారా. జస్ట్ రూ.199.65 కోట్లు మాత్రమే.

More Telugu News