Telangana: జంతువులే కాదు, చెట్లూ చచ్చిపోతున్నాయ్.. చర్యలు తీసుకోండి!: రేవంత్ రెడ్డి

  • ఓఆర్ఆర్ వద్ద ప్రమాదకర రసాయనాల విడుదల
  • దీనివల్ల పర్యావరణం పూర్తిగా దెబ్బతింటోంది
  • ట్విట్టర్ లో స్పందించిన కాంగ్రెస్ నేత

హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొన్ని పరిశ్రమలు రాత్రిపూట ప్రమాదకరమైన రసాయనాలను వదిలేస్తున్నాయని కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషం కారణంగా పర్యావరణం నాశనమైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కండ్లకోయ వద్ద ఈ రసాయనాల కారణంగా అక్కడి నీటిని తాగే జంతువులు కూడా చనిపోతున్నాయని తెలిపారు.

గత ఏడాదికాలంగా ఈ వ్యవహారం నడుస్తోందని చెప్పారు. ఈ విషయంలో తాను పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దీన్ని అధికారిక ఫిర్యాదుగా భావించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన రేవంత్ రెడ్డి.. మేడ్చల్ కలెక్టర్, తెలంగాణ సీఎం కార్యాలయం ట్విట్టర్ హ్యాండిల్ లను ట్యాగ్ చేశారు. అలాగే ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని తన ట్వీట్ కు జతచేశారు.

More Telugu News