వైసీపీ జెండా దిమ్మెకు కరెంట్... షాక్ కొట్టి ముగ్గురు విద్యార్థుల మృతి!

- ప్రకాశం జిల్లా సంతమాగులూరు సమీపంలో ఘటన
- ఆడుకుంటూ వెళ్లి దిమ్మెను పట్టుకున్న విద్యార్థులు
- కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
ఇటీవలి వర్షాలకు ఆ జెండాపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. విషయం తెలియని ముగ్గురు విద్యార్థులు ఆడుకుంటూ దాని దగ్గరికి వచ్చారు. జెండా స్తంభాన్ని పట్టుకున్న వారికి ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దింతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబాలు తీవ్ర దుఖఃసాగరంలో మునిగిపోగా, విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.