Andhra Pradesh: ఏపీలో ఐదు కేన్సర్ ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తాం: సీఎం జగన్

  • విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడపలో కేన్సర్ ఆసుపత్రులు
  • ‘ప్రకాశం’లో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రి నిర్మిస్తాం   
  • వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో జగన్

ఏపీలో ఐదు కేన్సర్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖపై ఈరోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, విశాఖ, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడపలో పూర్తి స్థాయి సదుపాయాలతో ఈ కేన్సర్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ప్రకాశం జిల్లాలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ రీసెర్చ్ ఆసుపత్రిని నిర్మిస్తామని, విజయనగరం, విశాఖ జిల్లాలోని పాడేరు, పల్నాడులోని గురజాలలో వైద్య కళాశాలలు నిర్మిస్తామని వెల్లడించారు. రాబోయే రెండు నెలల్లో వీటికి శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ‘108’, ‘104’ వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్ లో ఉండాలని, ఆరేళ్లకు ఓసారి ఆ వాహనాలను మార్చాలని సూచించారు. కొత్తగా వెయ్యి వాహనాలను కొనుగోలు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన టెండర్లు సెప్టెంబరులో ఖరారు చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డు, క్యూఆర్ కోడ్ తో కార్డులు జారీ చేస్తామని చెప్పారు.  

More Telugu News