Botsa Satyanarayana: రాష్ట్రంలో వర్షాలు పడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: బొత్స

  • ప్రాజక్టులు నిండుకుండలా ఉండడం చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారన్న బొత్స
  • జన్మభూమి కమిటీలతో అందినంత దోచుకున్నారని మండిపాటు
  • సీఎం జగన్ ను బెదిరిస్తూ చంద్రబాబు మాట్లాడడం సరికాదంటూ ఆగ్రహం

చంద్రబాబు హయాంలో ఎప్పుడూ కరవు తాండవించేదని, ఇప్పుడు జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండడం, ప్రాజక్టుల్లో జలకళ ఉట్టిపడుతుండడం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో భారీ దోపిడీ జరిగిందని, ఎవరెంత తిన్నారో మరో రెండ్రోజుల్లో బయటికి వస్తుందని అన్నారు. చంద్రబాబు పాలన సందర్భంగా ఇసుక దోపిడీ జరిగిందని, త్వరలోనే తాము నూతన ఇసుక విధానాన్ని తీసుకువస్తామని బొత్స స్పష్టం చేశారు. జన్మభూమి కమిటీలతో అందినంత దోచుకున్నారని మండిపడ్డారు.

వైఎస్ ప్రారంభించిన ప్రాజక్టుల్లో ఏ ఒక్క దాన్నీ గత ప్రభుత్వం పూర్తిచేయలేదని, మరి తన పాలనా కాలంలో నదుల అనుసంధానం చేశారో, నిధుల అనుసంధానం చేశారో చంద్రబాబే చెప్పాలని విమర్శించారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు సీఎం జగన్ ను బెదిరిస్తూ మాట్లాడుతున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News