Rapaka: హీరోయిజం కోసమే మలికిపురం ఎస్సై నన్ను తిట్టాడు: రాపాక

  • జనసేన సిద్ధాంతాల ప్రకారమే స్వచ్ఛందంగా లొంగిపోయానన్న రాపాక
  • జనసేన కార్యకర్తలు స్టేషన్ లో అద్దాలు పగులగొట్టలేదని స్పష్టీకరణ
  • తన విషయంలో సభా హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ ఆగ్రహం

తూర్పు గోదావరి జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్ పై దాడికి యత్నించాడంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాపాక పీఎస్ లో లొంగిపోయారు. ఆయనను న్యాయస్థానం కోర్టులో హాజరుపర్చగా, ఓ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే విధానం ఇది కాదంటూ న్యాయమూర్తి పోలీసులకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాపాక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోయిజం కోసం మలికిపురం ఎస్సై తనను తిట్టాడని వివరించారు.

పోలీసులు చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమపై వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని, జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ అద్దాలను పగులగొట్టలేదని స్పష్టం చేశారు.  అయితే, జనసేన సిద్ధాంతాల ప్రకారమే స్వచ్ఛందంగా లొంగిపోయానని చెప్పారు. తన విషయంలో సభా హక్కుల ఉల్లంఘన జరిగిందని అన్నారు.

More Telugu News