Manmohan Singh: రాజస్థాన్ నుంచి నామినేషన్ వేసిన మన్మోహన్ సింగ్

  • జైపూర్ లో నామినేషన్ దాఖలు చేసిన మన్మోహన్
  • ఆయన వెంట అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్
  • జూన్ నెలలో ముగిసిన మన్మోహన్ రాజ్యసభ కాలపరిమితి

 రాజ్యసభ ఎన్నికలకు గాను రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నామినేషన్ వేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు. అంతకు ముందు జైపూర్ ఎయిర్ పోర్టులో మన్మోహన్ కు రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ స్వాగతం పలికారు.

 ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లను గెలుచుకుంది. 12 మంది ఇండిపెండెంట్లు, మాయావతికి చెందిన బీఎస్పీ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేల అండతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో, రాజస్థాన్ నుంచి మన్మోహన్ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత జూన్ లో మన్మోహన్ సింగ్ రాజ్యసభ కాలపరిమితి ముగిసింది. గతంలో ఆయన అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో... ఈ సారి రాజస్థాన్ నుంచి బరిలోకి దింపింది. బీజేపీ నేత మదన్ లాల్ సైనీ మరణంతో ఈ రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది.

More Telugu News