SIAM: ఇండియన్ మార్కెట్లో భారీగా తగ్గిపోయిన కార్ల అమ్మకాలు!

  • గత సంవత్సరంతో పోలిస్తే తగ్గిన విక్రయాలు
  • 35.95 శాతం తగ్గాయన్న సియామ్
  • కొనుగోలుదారుల్లో సెంటిమెంట్ పెంచాలని పరిశ్రమ వినతి

గడచిన జూలై నెలలో ఇండియాలో పాసింజర్ కార్ల అమ్మకాలు 35.95 శాతం పడిపోయాయని సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్) వెల్లడించింది. గత సంవత్సరం జూలైతో పోలిస్తే, ఈ సంవత్సరం దాదాపు అన్ని వాహన కంపెనీల అమ్మకాలూ దిగజారాయని పేర్కొంది. మొత్తం వాహన అమ్మకాలు 18.71 శాతం పడిపోయాయని, కమర్షియల్ వాహన అమ్మకాలు 25.71 శాతం తగ్గాయని, మోటార్ సైకిల్ అమ్మకాలు 18.88 శాతం దిగజారాయని, స్కూటర్ల అమ్మకాలు 12.10 శాతం తగ్గాయని సియామ్ పేర్కొంది.

కాగా, భారత వాహన పరిశ్రమలో కస్టమర్ల సెంటిమెంట్ ను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు గతవారంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి విన్నవించారు. వాహన పరిశ్రమలో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు తగ్గాయని, సుంకాలను తగ్గించడం ద్వారా సెంటిమెంట్ ను పెంచాలని కోరారు. గడచిన మూడు నెలల వ్యవధిలో వాహన పరిశ్రమలో 2 లక్షల మంది ఉపాధిని కోల్పోయారని ఫాడా వైస్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ వెల్లడించారు.

More Telugu News