New Delhi: ఢిల్లీ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. గంటపాటు నిలిచిన సేవలు

  • టెర్మినల్ 2లో బాంబు పెట్టినట్టు ఫోన్ కాల్
  • విమానంలోని ప్రయాణికులను లోపలే ఉంచేసిన భద్రతా సిబ్బంది
  • భయంతో హడలిపోయిన ప్రయాణికులు

స్వాతంత్ర్య దినోత్సవానికి సరిగ్గా మూడు రోజుల ముందు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు కాల్ కలకలం రేపింది. టెర్మినల్2లో బాంబు పెట్టినట్టు సోమవారం రాత్రి 8:49 గంటల సమయంలో ఫోన్ రావడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది టెర్మినల్ 2లోని ప్రయాణికులను ఖాళీ చేయించి సేవలను నిలిపివేశారు. టెర్మినల్ 2లోని ప్రయాణికులను గేట్ నంబరు 4కు తరలించారు. విమానంలో వచ్చిన ప్రయాణికులను కిందికి దిగకుండా లోపలే ఉంచేశారు.

దాదాపు 70 నిమిషాలపాటు బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా గాలించిన తర్వాత అది ఫేక్ కాల్ అని తేల్చారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News