Krishna River: సముద్రుడిలో ఐక్యమయ్యేందుకు బిరాబిరా కృష్ణమ్మ పరుగులు!

  • కృష్ణానదిపై నిండిన అన్ని ప్రాజెక్టులు
  • వస్తున్న నీటిని వస్తున్నట్టు వదిలేస్తున్న అధికారులు
  • లంక గ్రామాల్లో అధికారులు అప్రమత్తం

ఇక కృష్ణమ్మ పరుగులన్నీ సముద్రుడి వైపే. దాదాపు పది సంవత్సరాల తరువాత నదీమతల్లి మహోగ్రరూపం దాల్చగా వస్తున్న నీరు ఈ సాయంత్రం నుంచి సముద్రంలో కలవనుంది. ఇప్పటికే కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ లు పూర్తిగా నిండిన స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వస్తున్న నీటిని వస్తున్నట్టు అన్ని ప్రాజెక్టులకు విడుదల చేస్తున్నాయి. ఈ మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజ్ నిండిపోనుండగా, సాయంత్రం నుంచి నీటిని బంగాళాఖాతంలోకి విడుదల చేయనున్నామని అధికారులు వెల్లడించారు.

కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామని, ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల 5 లక్షల క్యూసెక్కులను దాటితే, లంక గ్రామాల్లోకి నీరు చేరుతుందని, వారిని అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు తెలిపారు. 

More Telugu News