Kurnool District: కర్నూలులోకి వరద నీరు.. భయాందోళనలలో ప్రజలు!

  • శ్రీశైలం ప్రాజక్టుకు భారీగా వరద నీరు
  • శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో కలుస్తున్న తుంగభద్ర వరద
  • కర్నూలు జోహరాపురం-పాతనగరం మధ్య నిలిచిపోయిన రాకపోకలు

కృష్ణా నదికి భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం ప్రాజక్టు నిండుకుండను తలపిస్తోంది. నిత్యం భారీస్థాయిలో వరద నీరు శ్రీశైలం చేరుతుండడంతో, దిగువకు కూడా అదేస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. అయితే, వరద తగ్గుముఖం పట్టకపోవడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఇప్పుడు కర్నూలు పట్టణంలో ప్రవేశించాయి. మరోవైపు సుంకేశుల నుంచి 2 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తుంగభద్ర వరద తోడవడంతో కర్నూలు పట్టణం వరకు వరదనీరు చేరింది.

పట్టణంలోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నీటి తాకిడి కారణంగా జోహరాపురం, పాతనగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్రమేపీ వరద తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News